పవన్‌ను ప్రశ్నిస్తూ రోజా ట్వీట్
NEWS Oct 08,2024 10:46 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై మాజీ మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. పంచె ఎగ్గట్టాల్సింది, దీక్షలు చేయాల్సింది గుడిలో కాదని.. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అంటూ రోజా ట్వీట్ చేశారు. దేవుడు బుద్ధి, జ్ఞానం ఇచ్చి ఉంటే కాస్తైనా ఉపయోగించండి అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పిఠాపురం మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కఠినంగా శిక్షిస్తామని పవన్ చెప్పారు.