కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు
NEWS Oct 08,2024 10:11 am
జగిత్యాల: గ్రామపంచాయతీల ద్వారానే అభివృద్ధితో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని జగిత్యాల MLA సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం హబ్సిపూర్, సంగంపల్లి గ్రామాలలో నూతన GP భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. సర్పంచుల పాలనను మరిపించేలా స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉండాలని గ్రామాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు.