Logo
Download our app
మోస‌పోయి.. ఇరాక్‌లో నరకయాతన
NEWS   Oct 08,2024 10:14 am
జగిత్యాల జిల్లా సారంగపూర్‌కు చెందిన అజయ్ అనే యువకుడు ఉపాధి కోసం ఇరాక్ దేశానికి వెళ్లాడు. అధిక వేతనం ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి, అతనికి రూ.2.70 లక్షలు ఇచ్చానని చెప్పాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ తనని మోసం చేసి, పాస్‌పోర్ట్ తీసుకొని గదిలో బంధించి వెళ్లాడని తెలిపాడు. తినడానికి తిండి కూడా స‌రిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనని ఎలాగైనా స్వదేశానికి తీసుకొని తీసుకువెళ్లాలని సెల్ఫీ వీడియో ద్వారా కోరాడు.
⚠️ You are not allowed to copy content or view source