పేద క్రీడాకారులను ఆదుకుంటాం
NEWS Oct 08,2024 10:03 am
ధర్మారం మండలం మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలిబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ., క్రీడలతో మానసికొల్లాసం పెరుగుతుందని, క్రీడల్లో ప్రతిభ ఉండి ఆర్థికంగా లేని క్రీడాకారులు తనను సంప్రదించాలని, వారికి తాను, తమ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటామని తెలిపారు. క్రీడాకారులకు ఎటువంటి అవసరం ఉన్న తనను సంప్రదించాలని ఆయన క్రీడకారులకు భరోసా కల్పించారు.