మూడో ‘దృశ్యం’తో ముగిస్తారు!
NEWS Oct 08,2024 06:22 am
జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో దృశ్యం-3 మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయట. 2025 క్రిస్మస్ నాటికి విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈసారి.. ‘దృశ్యం’ కథను ముగించేయబోతున్నారు. మూడో పార్ట్‌తో సినిమాను ముగించేయాలని లాల్, జీతు ఫిక్సయ్యారట. ‘దృశ్యం’ రెండు భాగాలు దాదాపు అన్ని భాషల్లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో వెంకటేశ్, మీనా నటించారు.