Logo
Download our app
లే క‌న్న‌య్యా.. ఇంటికెళ్లిపోదాం..
NEWS   Oct 08,2024 04:44 am
అన్నమయ్య జిల్లా: ఓ వైపు కన్నీరు కారుస్తూనే మరోవైపు భ్రమతో కుమారుడి మృతదేహం పక్కనే కూర్చుని అతడితో ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళిపోతామనీ చెబుతోంది. బాబూరామ్, శిరీష దంపతులు కుమారుడు చిన్నోడు (3) ఇటీవల అనారోగ్యానికి గురవడంతో రాజంపేట ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వ‌స్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. ముందు భాగంలో కూర్చున్న బాబు ఎగిరి రోడ్డుపై పడటంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిబ్బంది శ్యామ్ మృ తదేహాన్ని ఆసుపత్రిలో బెడ్‌పై ఉంచగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని.. కన్నయ్యా ఎం త సేపు పడుకుంటావు నిద్రలే.. అని పిలుస్తూ భ్రమలోనే ఉండిపోయారు.
⚠️ You are not allowed to copy content or view source