పండుగలు శాంతిభద్రతల మధ్య జరగాలని వినతిపత్రం
NEWS Oct 08,2024 04:01 am
మల్యాల మండల కేంద్రంలో ఈనెల 10, 12న జరగబోయే బతుకమ్మ, దసరా పండుగల వేడుకలు శాంతి భద్రతల మధ్య జరగాలని, జగిత్యాల జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కన్వీనర్ శివ సోమవారం ఎస్ఐ నరేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్ర, అజయ్, నరేష్, తరుణ్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.