నేడు భగీరధ నీటి సరఫరా బంద్
NEWS Oct 08,2024 04:04 am
జోగిపేట: సంగారెడ్డి జిల్లాలో అందోల్-జోగిపేట పురపాలన పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరాను మంగళవారం నిలిపివేస్తున్నట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. పుల్కల్ మండలం పేద్దారెడిపేట శివారులో మిషన్ భగీరథ సంపు వద్ద నియంత్రక కాలిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. కావున మరమ్మతులు నేపథ్యంలో సంఫరా బంద్ చేస్తున్నామని. ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు