ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు..
రోడ్డు కూడా కనబడని పరిస్థితి..
NEWS Oct 08,2024 04:03 am
మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డుల్లో ఖాళీ స్థలాలు కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారాయి. ఇంటికి వెళ్లాలన్నా పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరగడంతో రోడ్డు కూడా కనబడడం పరిస్థితి నెలకొంది. ఖాళీ ప్లాట్లు పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో దోమలు వ్యాప్తి చెంది స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారు. అధికారులకు స్పందించి పిచ్చి మొక్కలను తొలగించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.