దుర్గామాతకు బోనాలు సమర్పణ
NEWS Oct 07,2024 06:05 pm
మెట్ పల్లి పట్టణంలోని కళానగర్, మున్నూరు కాపు సంఘం, ఆదర్శనగర్, హనుమాన్ నగర్, త్రిశక్తి ఆలయం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతలకు సోమవారం బోనాలను సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళలు బోనాలను డప్పు చప్పళ్లతో ర్యాలీగా తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.