ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
NEWS Oct 07,2024 04:40 pm
సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతి చెందిన నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను సిద్ధరామప్ప (71), జగన్నాథ్ (41), రేణుక (36), వినయ్ (15)గా గుర్తించారు. వీరంతా పొలానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో, వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.