రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NEWS Oct 07,2024 04:33 pm
మల్లాపూర్ మండలం సంగేమ్ శ్రీరాంపూర్ లో ఆగి ఉన్న టాటా ఏసీ వాహనాన్ని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. మృతుడు అడ్లూరి నర్సయ్య(40) పాత దామరాజ్ పల్లి నుండి ఖానాపూర్ మండలం ఎల్లాపూర్ కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా సంగేమ్ శ్రీరాంపూర్ గ్రామంలో రోడ్డుపై ఆగి ఉన్న టాటా ఏసిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు