మెడిసిన్‌లో ఇద్దరికి నోబెల్ బహుమతి
NEWS Oct 07,2024 02:26 pm
మెడిసిన్‌లో నోబెల్ బహుమతి-2024ను అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. మైక్రో RNA, పోస్ట్ ట్రాన్స్‌క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ అందిస్తామన్నారు. జన్యు కార్యకలాపాలు ఎలా నియంత్రించబడతాయో ప్రాథమిక సూత్రాన్ని వారు కనుగొన్నట్లు తెలిపింది.