ప్రజలకు పోలీస్ శాఖ చేరువ: ఎస్పీ అశోక్
NEWS Oct 07,2024 11:46 am
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ లో భాగంగా నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు ఎస్పీ అశోక్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.