Logo
Download our app
అమ్మవారి పూజలో పాల్గొన్న జువ్వాడి
NEWS   Oct 07,2024 11:35 am
కోరుట్ల మండలం చిన్న మెట్పల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు గ్రామంలోని దుర్గాదేవి అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source