Logo
Download our app
చంద్రబాబుతో మల్లారెడ్డి, తీగల భేటి
NEWS   Oct 07,2024 07:57 am
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు మేమంతా చంద్రబాబును కలిసినట్టు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. మరోసారి పిలిచి మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులను ఏకతాటిపైకి తీసుకువచ్చి టీడీపీని బలోపేతం చేస్తామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source