మెట్రోలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు
NEWS Oct 07,2024 05:51 am
మెట్రో రెండో దశలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరిస్తున్నారు. ఈ ప్రతిపాదిత కొత్త కారిడార్-4కు ప్రస్తుతమున్న 3 కారిడార్లను కనెక్ట్ చేస్తారు. నగరంలో ఏ మూలన ఉన్నవారైనా ఈజీగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా మెట్రోను అనుసంధానం చేయనున్నారు. నాగోల్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కి.మీ. మార్గాన్ని మెట్రో ప్రతిపాదించింది. దీనికి సంబంధించి డీపీఆర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. కారిడార్-4లో మెుత్తం 24 స్టేషన్లు ఉంటాయి.