బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది?
NEWS Oct 07,2024 05:36 am
వరుస పండగలతో పాటు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్‌లో ఎగబాకుతున్న ముడి చమురు ధరలు, దేశ-విదేశీ స్టాక్ మార్కెట్ల పతనం వంటి నేపథ్యంలో మరో 3-4 నెలలదాకా గోల్డ్ రేట్లు తగ్గకపోవచ్చనే అంచనాలే వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న ధరల్లో 5 నుంచి 7 శాతం తగ్గవచ్చని చెప్తున్నారు. మదుపరులు తిరిగి తమ పెట్టుబడులను స్టాక్స్, బాండ్లవైపు మళ్లిస్తేనే గోల్డ్ రష్ తగ్గుతుందని అంటున్నారు. దీంతో ఇప్పట్లో బంగారం కొనుగోళ్ల జోలికి పెద్దగా వెళ్లకపోవడమే మంచిదంటున్నారు.