Logo
Download our app
భార‌త యువ‌తితో పాక్ క్రికెట‌ర్ పెళ్లి
NEWS   Oct 07,2024 05:16 am
పాకిస్థాన్ క్రికెట‌ర్ హ‌స‌న్ ర‌జా భారత సంతతికి చెందిన పూజా బోమన్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఇటీవ‌ల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. ఫిబ్రవరిలో వీరి వివాహం జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌ పూజకు ఇస్లాం మతంపై ఆసక్తి ఉందని, అందుకే పెళ్లికి ముందే మతం మారాలని భావిస్తున్నట్లు రజా చెప్పారు. 32 ఏళ్ల హ‌స‌న్ ర‌జా పాక్ త‌ర‌ఫున ఒక వ‌న్డే, 10 టీ20ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అనంత‌రం ఆయ‌న అమెరికాలో స్థిర‌ప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source