పవన్‌పై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు
NEWS Oct 07,2024 05:02 am
రాహుల్ గాంధీ, డీఎంకే నేతలపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు ఎంపీ(కాంగ్రెస్) తిరునావుక్కరసర్ మండిపడ్డారు. ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. తమిళనాడు నేతలను విమర్శించే స్థాయి ఆయనకు లేదని, అంతపెద్ద నాయకుడేమీ కాదని చెప్పారు. పవన్ రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి అని, వీధుల్లో వెలిసే విగ్రహం వంటివారని పేర్కొన్నారు.