Logo
Download our app
ఇదే అతిపెద్ద రుణమాఫీ: రేవంత్
NEWS   Oct 07,2024 04:58 am
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ పథకాన్ని అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 27 రోజుల్లోనే 22,22,067 మంది కర్షకులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ కింద రూ.17,869.22 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు సైతం త్వరలో మాఫీ చేస్తామన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్‌.. పంట రుణమాఫీ నిధుల గణాంకాలను వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు.
⚠️ You are not allowed to copy content or view source