కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం
NEWS Oct 07,2024 04:48 am
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చని అన్నారు.