టమాటా ధర పెరుగుదలకు కారణమిదే..
NEWS Oct 06,2024 05:51 pm
టామాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం 15 రోజుల్లోనే టమాటా ధరలు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. ప్రస్తుతం టమాటా ధర.. 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో సరఫరా తగ్గిపోవటంతో.. మార్కెట్‌లో డిమాండ్ పెరిగిపోయింది.
మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సరుకు లేకపోవటంతో.. ఈ పరిస్థితిని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటూ.. రేట్లు భారీగా పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.