బంగ్లాను ఓడించిన టీమిండియా కుర్రాళ్లు
NEWS Oct 06,2024 04:56 pm
3 మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో టీమిండియా గెలుపు బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. బంగ్లా జట్టుపై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించారు టీమిండియా కుర్రాళ్లు. బంగ్లా 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 11.5 ఓవర్లలోనే ఛేదించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ అక్టోబరు 9న ఢిల్లీలో జరగనుంది.