65 అడుగుల దుర్గామాత విగ్రహం!
NEWS Oct 06,2024 03:52 pm
HYD: ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పారు. కోఠిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న విక్టరీ ప్లే గ్రౌండ్లో ఏకంగా 65 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు సింహ వాహనంపై మహాశక్తి అవతారంలో కనిపిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ లానే దుర్గామాత విగ్రహాన్ని కూడా ఉన్నచోటే తయారు చేయించారు.