Logo
Download our app
కేసీఆర్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు
NEWS   Oct 06,2024 03:41 pm
మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రావు. పోలీసులు వారం రోజుల్లో కేసీఆర్ ఆచూకీ కనిపెట్టాలని కోరారు. రాష్ట్రానికి పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో పోరాడాలన్నారు. కేసీఆర్ ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం రావాలన్నారు. పోలీసులు వారం రోజుల్లో కేసీఆర్ ఆచూకీ కనిపెట్టకపోతే.. తామే కేసీఆర్ ను వెతికే కార్యక్రమాలు చేస్తామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source