పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన
NEWS Oct 06,2024 03:32 pm
కంబదూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకే చోట చేరి గత అనుభవాలను నెమర వేసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని తమ జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించారు.