బీర్పూర్: గోమాతకు జన్మదిన వేడుకలు
NEWS Oct 06,2024 03:36 pm
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కేంద్రంలో గోమాతకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీర్పూర్ కు చెందిన బైరవని సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు తమ పెంచుకుంటున్న పశువులకు ఇటీవలే పుట్టిన లేగ దూడ గోమాతకు సంవత్సరం గడిచిన సందర్భంగా వేద పండితులు సంతోష్ ఆచార్యులు సమక్షంలో వేదమంత్రాలతో పూల అలంకరణతో హారతులు ఇచ్చి అల్లారుముద్దుగా పుట్టినరోజు వేడుకలు జరిపారు.