పాకిస్థాన్‌పై భారత్ విజయం!
NEWS Oct 06,2024 01:55 pm
మహిళల టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 29 పరుగులు చేసి రిటైరైంది. షెఫాలీ వర్మ అత్యధికంగా 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.