US: బతుకమ్మకు అరుదైన గౌరవం!
NEWS Oct 06,2024 02:02 pm
తెలంగాణ సాంసృతిక వైభవం బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాలు బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపుని చ్చాయి. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ర్టాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండగ, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించారు. బతుకమ్మ వైభవాన్ని, ప్రజలను కలుపుతూ వారి మద్య పెంపొందిస్తున్న సుహృద్భావ వాతావరణాన్ని వారు కొనియాడారు.