మడకశిరలో గుంతలు పూడ్చిన రూరల్ సీఐ
NEWS Oct 06,2024 01:00 pm
మడకశిర పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ పెనుగొండ రోడ్డులో ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో రోడ్డుపై ప్రయాణం వాహన చోదకులకు, బాటసారులకు నరకప్రాయంగా మారింది. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. ఈ విషయంపై మడకశిర రూరల్ సీఐ రాజ్ కుమార్ స్పందించి సీఐ రాజ్ కుమార్ పట్టణంలోని కాంట్రాక్టర్‌తో కలిసి ట్రాక్టర్ల ద్వారా జెల్లీ సిమెంట్ ను తెప్పించి గుంతలు పడిన చోట రోడ్డుపై జెల్లీ, సిమెంటును కలిపి పోసి గుంతలను పూడ్చారు.