నేతన్న విగ్రహం వద్ద పాలాభిషేకం
NEWS Oct 06,2024 04:49 pm
సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి నూలు డిపో కొరకు 50 కోట్లు నిధులు విడుదల చేసిన సందర్భంగా CM రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి, వనిత, నేరెళ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.