రూ.6.66 కోట్ల కరెన్సీతో అలంకరణ!
NEWS Oct 08,2025 11:07 am
దేవీ శరన్న వరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్‌నగర్‌లో శ్రీ వాసవి కన్య కాపరమేశ్వరి ఆలయంలో రూ.6,66,66,666తో అలంకరించారు. ఆదివారం మహాలక్ష్మీ అలంకరణలో అమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన కరెన్సీ నోట్లతో ఆలయ ఆవరణను అందంగా అలంకరించారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.