Logo
Download our app
గీతకార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ
NEWS   Oct 06,2024 10:22 am
జగిత్యాల మండలం అంతర్గంలో ఆదివారం కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గీత కార్మికుల వృత్తిరీత్యా తాటి చెట్లు ఎక్కుతూ జీవనం కొనసాగిస్తారని, చెట్లు ఎక్కే సమయంలో పట్టు తప్పి కింద పడి మృతి చెందడ లేదా వైకల్యం పాలవడం జరగుతుందని, అలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గీత కార్మికులకు కాటమయ్య కిట్స్ ను అందిస్తుందన్నారు. చెట్లు ఎక్కేటప్పుడు పడిపోకుండా రక్షణగా ఈ కిట్లు ఉంటాయని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source