డ్రోన్ల ద్వారా మందుల సరఫరా
NEWS Oct 06,2024 09:35 am
గుంటూరు: గుంటూరు జిల్లా కొల్లిపరలో పైలట్ ప్రాజెక్టు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా విజయవంతమైంది. మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 15 కి.మీ. దూరంలోని అన్నవరపులంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి డ్రోగ్ డ్రోన్ ద్వారా 10 కిలోల టీకాలు, మందుల కిట్‌ను పంపించారు. రహదారులు, రేపల్లె కాలువ, కృష్ణా నది పరివాహక ప్రాంతాలను దాటి 10 నిమిషాల్లోనే డ్రోన్ లక్ష్యాన్ని చేరుకుంది. PHC వైద్యాధికారిణి సీహెచ్ లక్ష్మీసుధ, తహసీల్దార్ సిద్ధార్థ, MPDO విజయలక్ష్మి పర్యవేక్షించారు.