18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
NEWS Oct 06,2024 06:42 am
HYD: ముంబై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది సైబర్ క్రిమినల్స్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు CBI, ED, Drugs పేరుతో ప్రజల్ని భయపెట్టి కోట్లు వసూళ్లు చేశారు. ఒక్క హైదరాబాద్ ప్రాంతం నుంచే 7 కోట్లు కొట్టేశారు. వీరిపై మొత్తం 435 కేసులు నమోదైయ్యాయి. వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కి స్పందించవద్దని సిపి సీవీ ఆనంద్ ప్రజలకు సూచించారు.