తూప్రాన్ లో ఒకరు ఆత్మహత్య
NEWS Oct 06,2024 04:51 pm
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నెంటూర్ గ్రామానికి చెందిన కొండూరు శ్రీశైలం (45) టైల్స్ వేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఏడాదికాలంగా భార్యా పిల్లలతో తూప్రాన్ లో నివాసం ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు.