దసరా సందర్భంగా అదనపు బస్సులు
NEWS Oct 06,2024 05:10 am
నల్గొండ: ఆర్టీసీ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్ నుంచి నల్గొండకు దసరా సెలవుల సందర్భంగా రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనాథ్ తెలిపారు. నల్గొండలో శనివారం మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 6వ తారీకు నుంచి 11 వరకు 80 బస్సులు, 13 నుంచి 16 వరకు 30 బస్సులు అదనంగా నడిపిస్తామని తెలిపారు. తిరుగు ప్రయాణంలో కూడా నల్లగొండ నుండి బస్సులు నడిపిస్తామని తెలిపారు.