యూత్ లోగోను ఆవిష్కరించిన ఎస్ఐ
NEWS Oct 06,2024 05:07 am
మల్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీ యువత స్థాపించిన టీం రాయల్స్ యూత్ లోగోను శనివారం స్థానిక ఎస్ఐ నరేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమని, చెడుదారులకు పోకుండా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాక లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, గుండేటి రవితేజ, దొంతరవేని శేఖర్, సంతోష్, నరేష్, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.