కొండా సురేఖ, రేవంత్ పై పరువు నష్టం
NEWS Oct 05,2024 06:20 pm
మంత్రి కొండా సురేఖతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేయనున్నట్టు కేటీఆర్ హెచ్చరించారు. తన మీద అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖను వదిలిపెట్టనని, క్రిమినల్ కేసుతో పాటు పరువునష్టం దావా కూడా వేస్తానని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పట్టించుకోలేదని.. ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. మూసీలోని కంపు అంతా రేవంత్ నోట్లోనే ఉందని కేటీఆర్ ఘాటు వ్యఖ్యలు చేశారు.