కలెక్టరేట్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు.
NEWS Oct 05,2024 05:35 pm
సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. వేడుకలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయా డిపార్ట్మెంట్ ల మహిళా అధికారులు, ఉద్యోగినులు, సిబ్బంది రంగురంగుల పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్దారు. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మహిళా అధికారులు, ఉద్యోగినులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు.