ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు.
NEWS Oct 05,2024 06:26 pm
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కృషి చేశారని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను జిల్లాయువజన అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో నిర్వహించగా, అదనపు కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాకా చిత్రపటానికి పూల మాలలు వేసి,ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీ.వై.ఎస్.ఓ రాందాస్,వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో రామ్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.