డీఎస్సీ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తి
NEWS Oct 05,2024 05:39 pm
కొత్తగూడెం సింగరేణి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న డీఎస్సీ 2024 అభ్యర్థుల వివిధ అంశాలలో ద్రువపత్రాల వెరిఫికేషన్ పూర్తి అయినది. ఇందులో భాగంగా 1051 మంది అభ్యర్థులకు గాను 971 మంది అభ్యర్థులు హాజరయ్యారు. SGT స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 36 మందికి గాను 31 మంది హాజరయ్యారు. వీరందరి యొక్క ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందని జిల్లా విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.