ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటేనే దర్శనం
NEWS Oct 05,2024 05:18 pm
అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమవ్వడంతో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుంది. శబరిమల వచ్చే భక్తులు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని, రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. అయ్యప్ప భక్తులు పరమపవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ నెల రోజుల్లో ప్రారంభం కానుంది.