కాటన్ అనుబంధ పరిశ్రమను ఆదుకోవాలి
NEWS Oct 05,2024 06:28 pm
ప్రభుత్వం ఇచ్చే చీరలలో కాటన్ మిలితంతో తయారు చేసిన చీరలను ఇస్తూ,కాటన్ అనుబంధ పరిశ్రమల మనుగడను కాపాడి,కాటన్ కార్మికులకు ఉపాధి కల్పించాలని, సిరిసిల్ల జిల్లాలో చేనేత జౌళి శాఖ కార్యాలయంలో ఏడి సాగర్ కు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కాటన్ అనుబంధ పరిశ్రమల ఐక్యవేదిక అధ్యక్ష కార్యదర్శులు గౌడ సురేష్, తాటిపాముల దామోదర్, పిస్క మధు, దుబాల మొండయ్య, గాజుల రవి, మ్యాన సత్యం, గౌడ రాజు తదితరులు పాల్గొన్నారు.