గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు
NEWS Oct 06,2024 05:03 am
సిరిసిల్ల: సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులుర్పించారు. ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ దివంగత కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి యువజన విభాగ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అంచలంచెలుగా ప్రజాదారణతో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఏడుసార్లు పార్లమెంటు సభ్యులుగా గెలుపొంది కేంద్ర మంత్రిగా చేశారని గుర్తు చేశారు.