వికలాంగులకు బస్ పాస్ ల పంపిణీ
NEWS Oct 05,2024 06:27 pm
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామములో సిరిసిల్ల డిపో మేనేజర్ ఏ.ప్రకాష్ రావు ఆధ్వర్యంలో శనివారం రోజు వికలాంగులకు బస్ పాస్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మాట్లాడుతూ.. 50 శాతం ప్రభుత్వం కలిపించే రాయితీ బస్ పాస్ లను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని మనోధైర్యంతో ముందు ఉండాలని వారు సూచించారు. కార్యక్రమంలో డిపో సూపరవైజైర్ రాంరెడ్డి, జి.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.