ప్రభుత్వ బాలికల కళాశాలలో బతుకమ్మ సంబరాలు.
NEWS Oct 05,2024 05:32 pm
సిరిసిల్ల పట్టణంలో స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల కళాశాల సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగు రంగు పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో హోరెత్తించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.శ్రీనివాస్ అందమైన బతుకమ్మలను పేర్చిన విద్యార్థినిలను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మురళీ,సీతారాము, సునీత, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్,మడుపు నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.