Logo
Download our app
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
NEWS   Oct 05,2024 05:33 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ రఘునందన్ మాట్లాడుతూ పూలను పూజిస్తూ, మహిళలు పాడే బతుకమ్మ పాటల్లో తమ కష్ట సుఖాలు, ప్రేమ, ఆప్యాయతలు, భక్తి లాంటివి స్పష్టంగా కనబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source