రామకృష్ణ కళాశాలలో బతుకమ్మ వేడుకలు
NEWS Oct 05,2024 05:24 pm
రామకృష్ణ జూనియర్ డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేకంగా తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ డైరెక్టర్లు హరిప్రియ, అంజయ్య గౌడ్, ప్రిన్సిపల్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సకినాల రాజు, ఉపన్యాసక బృందం అధిక సంఖ్యలో విద్యార్థినిలు పాల్గొన్నారు.